Advertisement
ramya Krishnan look from police station mein bhoot

Ramya Krishnan : శివగామి నయా అవతార్.. ఆర్జీవీ చేతుల్లో పడితే అంతేగా మరి

Ramya Krishnan : రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఎంత మంచి నటి అనే విషయం అందరికీ తెలుసు. ఒక శివగామి పాత్ర చాలు. తను పాత్రలో ఎలా లీనం అయిపోతుందో చెప్పడానికి. ప్రస్తుతం రమ్యకృష్ణ ఓ హిందీ మూవీలో నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ అది. మూవీ పేరు పోలీస్ స్టేషన్ మే భూత్(Police Station Mein Bhoot). యూ కాంట్ అరెస్ట్ ది డెడ్(You Can’t Arrest The Dead) అనేది క్యాప్షన్. ఆ సినిమాలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయ్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జెనీలియా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలోనే రమ్యకృష్ణ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజాగా ఆ సినిమాకు సంబంధించిన రమ్యకృష్ణ లుక్ ను ఆర్జీవీ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. రమ్యకృష్ణ లుక్ కొంచెం వీర్డ్ గా ఉంది. నయా అవతార్ లో రమ్యకృష్ణ కనిపించింది. దీంతో ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉండబోతోందని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement