బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం దొంగల ముఠా టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ ని రక్తి కట్టించడానికి హౌస్ బయటి నుండి అమర్ దీప్, అంబటి అర్జున్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈరోజుతో ఈ టాస్క్ ముగిసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ లీక్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఓ ఇద్దరు కంటెస్టెంట్లని బయటికి పంపించబోతున్నట్టు సమాచారం.
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లని హౌస్ బైటికి పంపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు రాము రాథోడ్ (Ramu rathod) కాగా, మరొకరు ఆయేషా(Aayesha). హౌస్ లో ఈ వారం మరోసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుందని, ఆ ఎలిమినేషన్ లో భాగంగా లీస్ట్ లో ఉన్న రాముని హౌస్ మేట్స్ అందరూ కలిసి బయటికి పంపనున్నారని సమాచారం.
ఇక ఆయేషా విషయానికి వస్తే… గత రెండు రోజులుగా ఆయేషా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుంది. బహుశా జ్వరం కావచ్చు ఇంకేదైనా కావచ్చు. ఈ అనారోగ్య కారణాల దృష్ట్యా బిగ్ బాస్ ఆయేషాని తాత్కాలికంగా బయటికి పంపే అవకాశం ఉందని, అయితే ఒక వారం తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి తీరాలి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

