గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) తాజాగా మరోసారి తండ్రిగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. 2023 లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ – ఉపాసన దంపతులు, ఈసారి డబుల్ ట్రీట్ అందుకున్నారు. అంటే కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఇక మరోసారి తల్లి అయిన ఉపాసన (Upasana) ఈసారి ఒక ఆడబిడ్డ, మగ బిడ్డకు జన్మనిచ్చారు. జనవరి 31న సాయంత్రం పూట ఈ శుభవార్తను చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అనంతరం రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో ఈ వార్తను అభిమానులతో షేర్ చేసారు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది (Peddi) పై పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ లో అంచనాలున్నాయో తెలిసిందే. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వస్తుండగా, నిజమేనంటూ మెగా వర్గాల నుండి కూడా అనధికార సమాచారం వచ్చింది. అయితే రామ్ చరణ్ తాజాగా తండ్రిగా మరోసారి ప్రమోట్ కావడంతో పెద్ది ఇక వాయిదా పడడం ఖాయమేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ గత కొన్ని రోజుల నుండి ఉపాసన కోసం షూటింగ్ వాయిదా వేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
ఇప్పుడు ఉపాసన డెలివరీ కూడా అయి, ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది కావున చరణ్ ఇంట్లోనే కొన్నాళ్ళు ఫ్యామిలీతో గడపాల్సి ఉంటుంది. అందువల్ల పెద్ది షూటింగ్ కి దాదాపు నెలరోజులు రాకపోయే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దీంతో పెద్ది సమ్మర్ నుండి జులై కి షిఫ్ట్ అయిపోయినట్టే అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పెద్ది ఎప్పుడొచ్చినా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని దానిపై ఉన్న అంచనాలని బట్టి తెలుస్తూనే ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
