Advertisement

Ramayana Teaser : విడుదలైన “రామాయణ” టీజర్… ఈ దీపావళికే మైథలాజి గ్రాండియర్ విజువల్ వండర్

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “రామాయణ” (Ramayana) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.2000 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ కు మంచి స్పందన లభించగా, హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.

ఇక రామాయణ టీజర్‌ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం విజువల్స్ మరియు నేపథ్య సంగీతంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ప్రశాంతతతో పాటు కోదండ రాముడిగా గాంభీర్యాన్ని ప్రతిబింబిస్తూ కనిపించాడు. ఇక రామాయణ లో సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే తమ పాత్రలకు తగినట్లు ఎంపికయ్యారు. టీజర్ చివరలో పుష్పక విమానంలో రావణుడిగా యశ్ ని బ్యాక్ షాట్స్ తో చూపించగా, ఆ విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసాయి.

Advertisement

అలాగే టెక్నికల్ గా అద్భుతమైన VFX వర్క్ ఈ టీజర్ లో గమనించవచ్చు. దానికి తోడు హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ అందించిన బీజీఎమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక రామాయణ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా, నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. “రామాయణ” తొలి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement