మెగా ఫ్యామిలీ ఇంట్లో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా సినిమాల పరంగానే కాకుండా అన్ని రకాలుగానూ మెగా ఫ్యామిలీకి కలిసొస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలి లో మరో గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ (Ramcharan) – ఉపాసన (Upasana) దంపతులు మరో సారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ ఇంట సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి.
ఇక ఈ విషయాన్నీ తాజాగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ పంచుకోగా, సెలెబ్రేషన్స్ మాత్రం దీపావళి రోజునే జరిగాయని సెలెబ్రేషన్స్ వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. ఆ వీడియోలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉపాసనకు స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ఆశీర్వదిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఇటు రామ్ చరణ్ కూడా ఎంతో సంతోషం తో వెలిగిపోతున్నాడు. ఇక ఈ సెలెబ్రేషన్స్ లో నాగార్జున, వెంకటేష్ ఫ్యామిలీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

