Advertisement

రాజా ది రాజా సినిమా వివరాలు వెల్లడించిన చిత్ర బృందం

మన పత్రిక, హైదరాబాద్: రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం రాజా ది రాజా (Raja Di Raja). అనిల్ బోయిడపు దర్శకత్వంలో బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 17న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత కె. నిహారిక దాసరి మాట్లాడుతూ కథపై తాము చాలా నమ్మకంగా ఉన్నామని తెలిపారు.

ఈ చిత్రంలో హీరో రుత్విక్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో ఫిల్మ్ కోర్స్ (Film Course) పూర్తి చేసిన రుత్విక్‌ను బలమైన పాత్రతో పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కథను ఎంచుకున్నట్లు వివరించారు. ట్రైలర్‌లో చూపిన సన్నివేశాలను మరే ఇతర సినిమాతో పోల్చలేమని, అసలు ట్విస్ట్ సినిమా చూశాకే తెలుస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Advertisement