మన పత్రిక, క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు పట్టుబడటం సంచలనంగా మారింది. పోలీసుల నిత్య గస్తీ ఉండే ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉన్న మర్లు, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిర్వాహకులు ఈ దందాను సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది విటులతో ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ దందా నిర్వాహకుడు తన చుట్టూ సుమారు 20 మంది అనుచరులతో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. ఎవరికి అనుమానం రాకుండా తరచూ అద్దె ఇళ్లు మారుస్తూ (దాదాపు 40 ఇళ్లు) కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు పంపిస్తూ, కోడింగ్ భాషలో వ్యవహారాలు నడిపించడం ద్వారా పోలీసుల కన్నుగప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రెండువేల మందికి పైగా కాంటాక్ట్స్‌తో ఈ దందాను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పోలీసుల దాడిలో పట్టుబడిన ప్రధాన నిందితుడు స్టేషన్ బెయిల్‌పై విడుదలై మళ్లీ అదే కార్యకలాపాలు కొనసాగించాడని సమాచారం. దీంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద స్థాయిలో ఆరేళ్లుగా ఈ దందా కొనసాగడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాధారణ కాలనీల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగడం యువతపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఆరు సంవత్సరాలుగా పోలీసుల కళ్లుగప్పి ఈ వ్యవహారం సాగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ చీకటి సామ్రాజ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- సీఆర్పీఎఫ్లో 9,195 ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు | CRPF Tradesman Recruitment 2026
- JR NTR : బన్నీ కి ఒకే.. మరి చరణ్ కి? అంటే అప్పట్లోదంతా అబద్దమా? లేక?
- Durandhar2 @1500+ : దురంధర్ సీక్వెల్ భారీ రికార్డు.. కానీ ఆ అసలైన రికార్డు సాధ్యం కాదా?
- [24]7.ai Walk-in Drive : బెంగళూరులో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు ఛాన్స్!
- Sagility Walk in Drive : సాజిలిటీ వాక్ ఇన్ డ్రైవ్.. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. 3 LPA వరకు జీతం!
