Bus Fire Accident : కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం ఘటనను మరవకముందే మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. రాజస్థాన్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ స్లీపర్ బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది.
జైపూర్, ఢిల్లీ హైవేలో బస్సు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. హైవే నుంచి సర్వీస్ రోడ్ లోకి వెళ్లిన బస్సు పైన హైటెన్షన్ కరెంట్ వైర్లు తగలడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు బస్సంతా వ్యాపించడంతో వెంటనే బస్సును ఆపేశాడు డ్రైవర్.
ప్రయాణికులు కొందరు బస్సు నుంచి దూకేశారు. అయినప్పటికీ అందులో చిక్కుకుపోయి ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

