మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రముఖ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా (AstraZeneca) మరియు ఇతర భాగస్వామ్య సంస్థలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా అమరావతిలో ‘ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్’ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రెసిషన్ ఆంకాలజీ క్యాన్సర్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
ఈ కేంద్రం ద్వారా ఊపిరితిత్తులు మరియు రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అత్యంత అధునాతన జన్యు పరీక్షలు జీఈఎన్ఓఎమ్ఐసీ టీఈఎస్టీఎస్ (Genomic Tests) నిర్వహించనున్నారు. ప్రెసిషన్ ఆంకాలజీ విధానంలో ప్రతి రోగి జన్యు లక్షణాలకు అనుగుణంగా సరైన వైద్యాన్ని అందించడానికి ఈ సేవలు ఉపయోగపడతాయని వెల్లడించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
