టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ చిత్రాల్లో “స్పిరిట్” (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వెయ్యి కోట్ల రేంజ్ ఉన్న సినిమాల్లో ఇదీ ఒకటి కాగా, సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకున్నా భారీ బజ్ నెలకొని ఉంది. ఇక ఈ సినిమాలో తృప్తి ధిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక స్పిరిట్ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash raj) ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అయితే ఈ సినిమాలో నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ కి దర్శకుడు సందీప్ వంగతో గొడవ జరిగిందని, అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారని సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఈ వార్తల్ని ఖండిస్తూ ట్వీట్ చేసారు ప్రకాష్ రాజ్. వస్తున్న రూమర్లపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఎక్స్(ట్విట్టర్) అకౌంట్‌లో “విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి.. “స్పిరిట్” (Spirit) సినిమా గురించి ఒక్క విషయం చెప్పాలి. అసలు నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగే ఇంకా మొదలవ్వలేదు. అప్పుడే మీ “వాట్సాప్ ఫ్యాక్టరీ” లో కథలు అల్లేస్తున్నారా? కాస్త ఎదగండి.. మీ పనులు మీరు చూసుకోండి” అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యాడు.
దీంతో “స్పిరిట్” (Spirit) సినిమాలో ప్రకాష్ రాజ్ తొలగిపోయారని వస్తున్న రూమర్లకు చెక్ పెట్టి అందులోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీ రోల్ లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ భారీ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది మార్చి 2027 లో విడుదల కానుంది. ఈలోపు ప్రభాస్ “ఫౌజి” ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. కుదిరితే మధ్యలో సలార్ 2, లేదా కల్కి 2 కూడా స్టార్ట్ చేయొచ్చు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
