పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu raghavapudi) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1930స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ వార్ & రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా నుండి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ లో అతడే ఒక సైన్యం అన్నట్టు ఇంగ్లీష్ లో ఓ కాప్షన్ రిలీజ్ చేసి, “1932 నుంచి ది మోస్ట్ వాంటెడ్” అనే క్యాప్షన్ పోస్టర్ లో ఉంచారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ సోల్జర్ గా నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రేపు అనగా అక్టోబర్ 23న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. టైటిల్ కూడా అనౌన్స్ చేయకుండానే సినిమాపై అంచనాలు పెరిగిపోగా, టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక సినిమాపై అంచనాలు పీక్స్ కి వెళ్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా ఇమాన్వి (Imanvi) పరిచయం అవుతుండగా, విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

