సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన’ ద్వారా భారీ ఊరటనిస్తోంది. పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న మేస్త్రీలు, టైలర్లు, వడ్రంగులు, స్వర్ణకారులు వంటి చేతివృత్తుల వారికి ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం లభిస్తుంది. వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షించి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ రుణాన్ని రెండు విడతల్లో అందిస్తారు. మొదటి విడతలో రూ.1 లక్ష, అది చెల్లించిన తర్వాత రెండో విడతలో రూ.2 లక్షలు ఇస్తారు. లబ్ధిదారులు కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు కాగా, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. గత ఐదేళ్లలో ఇతర ప్రభుత్వ రుణ పథకాలు పొంది ఉండకూడదు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
