PM Vidyalaxmi Scheme : ఉన్నత చదువులు చదవాలని అందరికీ ఉంటుంది కానీ చాలామంది దగ్గర డబ్బులు ఉండవు. లోన్ తీసుకుందామన్నా బ్యాంకులు సవాలక్ష ప్రశ్నలు అడుగుతాయి. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అని కాళ్లకు చెప్పులు అరిగేలా తిప్పుతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను తీసుకొచ్చింది. ఉన్నత చదువులు చదవాలని అనుకున్న విద్యార్ధుల కోసం 2024 లోనే ప్రధాన మంత్రి విద్యా లక్ష్మీ స్కీం ను తీసుకొచ్చింది.
ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు కొలటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. చాలా బ్యాంకులు ఈ లోన్ ను ప్రొవైడ్ చేస్తాయి. వడ్డీ కూడా ఇతర లోన్స్ తో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ స్కీమ్ కింద లోన్స్ తీసుకోవచ్చు. దేశంలో ఉన్న దాదాపు వెయ్యి కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ కొలటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్ ను అందిస్తుంది.
హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ లో చదివే వాళ్లు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే పీఎం విద్యాలక్ష్మీ స్కీం కింద ఏదైనా బ్యాంకులోకి వెళ్లి వాళ్లు చదివే కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్లను అందిస్తే ఫీజు ప్రకారం లోన్ ను ఇస్తారు. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, పీఎన్బీ, బీవోబీ, కెనెరా లాంటి బ్యాంక్ లు ఈ లోన్ ను అందిస్తున్నాయి. వడ్డీ కనీసం 7.15 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. 10.35 శాతం వరకు గరిష్ఠంగా వడ్డీ ఉంటుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

