Advertisement

ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ

మన పత్రిక: ఇన్‌స్టాగ్రామ్‌లో PM Narendra Modi పోస్ట్ చేసిన ఒక రీల్ కేవలం 24 గంటల్లోనే 327 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త డిజిటల్ రికార్డు నమోదు చేసింది. పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ ఈ వీడియోలో నేరుగా ప్రజలతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పరీక్షల అక్రమాలపై చర్చ జరుగుతున్న వేళ, విద్యార్థులకు భరోసా ఇస్తూ కఠిన చర్యల ప్రణాళికలను ఆయన వివరించారు.

ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో పాటు ప్రధాని మోదీ ఖాతాకు ఒక్క రోజే దాదాపు పది లక్షల మంది కొత్త ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు పెరిగారు. దీంతో ఆయన మొత్తం ఫాలోవర్ల సంఖ్య 102 మిలియన్లు దాటింది. ప్రజల నుంచి వచ్చిన స్పందనపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ, వీడియో చూసిన వారికి మరియు సలహాలు పంచుకున్న యువతకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement