PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాయలసీమలో మోదీ పర్యటన ఉండనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన ఉండనుంది.
Advertisement
16 వ తేదీన కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా పాల్గొంటారు. సభ అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

