PM Kisan 21th Installment : కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 21వ విడత ఆర్థిక సహాయం అక్టోబర్ 18, 2025న విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. బీహార్ నుంచి ప్రధాని మోదీ ఈ నిధులను జాతికి అందజేయనున్నారు.
ఇప్పటివరకు 20 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేశారు. సంవత్సరానికి మూడు విడతల్లో మొత్తం రూ.6,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా అందజేస్తారు.
అర్హతలు:
- 2 హెక్టార్ల లోపు భూమి ఉండాలి.
- ఆధార్ కార్డు తప్పనిసరి.
- బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ లింక్ చేసి ఉండాలి.
- భూమి ఆన్లైన్లో నమోదు చేయబడి ఉండాలి.
అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ అవుతుంది. ఇంకా KYC పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలి.
అర్హుల జాబితా ఎలా తనిఖీ చేయాలి?
అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in లో జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని “Get Report” క్లిక్ చేయండి. మీ పేరు జాబితాలో ఉంటే, 21వ విడత డబ్బు మీకు అందుతుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
