Advertisement

నరసరావుపేట: మహిళ కడుపులో పెన్నులు, స్పూన్లు

AP: నరసరావుపేటలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పొత్తికడుపులో పెన్నులు, స్పూన్లు ఉండటం చూసి వైద్యులు విస్తుపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటకు చెందిన 30 ఏళ్ల పెనుగొండ పావని కడుపునొప్పితో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. స్కానింగ్, ఇతర పరీక్షలు చేసిన నిపుణులు ఆమె పొత్తికడుపులో పెన్నులు, చెక్క స్పూన్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి వాటిని సురక్షితంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సర్జన్లు తెలిపారు. ఈ విచిత్ర ఘటనకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాల్సి ఉంది.

Advertisement

Advertisement