మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న పెద్ది (Peddi) పై టాలీవుడ్ లో ఏ స్థాయి అంచనాలున్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మొన్న ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి అదేమీ అడ్డుకానట్టు పెద్ది సినిమాకు భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. మొన్నటివరకు IPL ఇంపాక్ట్ వల్ల సినిమా గురించి ఎవరు పట్టించుకోరు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఐపీఎల్ ముగిశాక లెక్కలన్నీ మారిపోయాయి.
పెద్ది విడుదలకు ఇంకా రెండు రోజులు ఉండగానే ఓవర్సీస్ లో 1 మిలియన్ అడ్వాన్స్ సేల్స్ క్రాస్ అయినట్టు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా 25 కోట్ల మార్క్ ని దాటేసింది. బుక్ మై షో లో 24 గంటల్లో లక్ష బుకింగ్స్ ని అందుకోగా, ఇప్పటికి గంటకు ఎనిమిది నుండి పది వేల టికెట్లు బుక్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ బుకింగ్స్ స్పీడ్ ని బట్టి చూస్తుంటే పెద్ది మూవీ ఫస్ట్ డే వంద కోట్లకి పైగా గ్రాస్ అందుకోవడం ఖాయమని అనిపిస్తుంది. హిందీ బుకింగ్స్ కూడా జోరుగా ఉంటే దాదాపు 110 నుండి 150 కోట్ల వరకు ఓపెనింగ్స్ ఉండే చాన్సు ఉంది.
ఇక సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి ఏమి లేదు. ఆ మధ్య వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్లాప్ అయింది. అందుకే ఆడియన్స్ ఇంట్రెస్ట్ మొత్తం ఇప్పుడు పెద్ది సినిమాపై పడింది. దీన్ని మేకర్స్ క్యాష్ చేసుకుని మంచి అవుట్ ఫుట్ ఇస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ది రికార్డులు సెట్ చేయడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
- Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్గా నర్రా శ్రీజా రెడ్డి
