Advertisement

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ నివాసంలో ఏసీబీ సోదాలు: భారీగా నగదు స్వాధీనం

మన పత్రిక, పెద్దపల్లి: కాంట్రాక్ట్ బిల్లును మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ కల్లేపల్లి సతీశ్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

నివాసంలో భారీగా నగదు

నిందితుడి అరెస్టు అనంతరం ఏసీబీ అధికారులు సతీశ్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 32 లక్షలకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిందితుడిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement