Advertisement

ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన అటవీ అధికారి అరెస్ట్: పవన్ కల్యాణ్ ఆగ్రహం

మన పత్రిక, కడప: ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపి వారికి సహకరించిన అటవీ శాఖ అధికారి అరెస్ట్ కావడంపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనలో సదరు అధికారి పాత్రపై లోతైన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

కడప జిల్లాలో అధికారులు దాడులు నిర్వహించి రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అసలు ప్రధాన సూత్రధారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Advertisement
Advertisement