Advertisement

అరుదైన కొత్త మొక్కకు ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’గా పవన్ నామకరణం

మన పత్రిక: తూర్పు కనుమలలో కొత్తగా వెలుగుచూసిన ఒక అరుదైన మొక్కకు ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’ (Croton Ubbalamaduguensis) అని నామకరణం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మొక్కకు అధికారికంగా పేరు నిర్ణయించారు. అత్యంత అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లడం ఈ మొక్క ప్రత్యేకతగా ఉంది.

తిరుపతి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉబ్బలమడుగు జలపాతం సమీపంలో పరిశోధకులు ఈ కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అక్కడ లభించిన ప్రదేశం ఆధారంగానే దీనికి ఉబ్బలమడుగెన్సిస్ అని పేరు నిర్ణయించారు. కాగా, ఈ అరుదైన మొక్క ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతుల జాబితాలో ఉందని పరిశోధకులు వర్గీకరించారు.

Advertisement
Advertisement