Advertisement

అమెరికా డ్రాఫ్ట్‌ను యథాతథంగా ట్వీట్ చేసి బుక్కైన పాక్ ప్రధాని!

మన పత్రిక, ఇస్లామాబాద్: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యవర్తిత్వం నెరపుతున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి అంతర్జాతీయంగా నవ్వులపాలయ్యారు. ట్రంప్ ఆఫీసు నుంచి వచ్చిన డ్రాఫ్ట్‌ను, హెడింగ్‌ను కనీసం మార్చకుండా యథాతథంగా తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

తర్వాత తప్పు తెలుసుకుని వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే దాని స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. స్వదేశంలో పెరుగుతున్న నిరసనలు, భారీ వ్యయం, ఇరాన్ ఎదురుదాడితో సతమతమవుతున్న ట్రంప్.. ఈ యుద్ధం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటో, భారత్ వంటి దేశాలను గతంలో ట్రంప్ విమర్శించి ఉండటంతో, ఆయన చెప్పినట్లు ఆడే పాకిస్థాన్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు ఇరాన్‌కు కూడా ఈ యుద్ధాన్ని ఆపాలని ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌ను నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల మధ్య భారత్‌లోని కొందరు ప్రతిపక్ష నేతలు మోడీ జోక్యం చేసుకోవాలంటూ విమర్శలు చేయడం గమనార్హం.

Advertisement