Advertisement
paddy grains soaked due to untimely rains in telangana

Rains Damage Crops : అకాల వర్షం.. తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన

Rains Damage Crops : అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలే పంట కోసి చేతికొచ్చింది అని అనుకునే లోపే అకాల వర్షం రూపంలో రైతులకు సమస్యలు వచ్చేశాయి. వరి కోసి వడ్లను ఎండబెట్టిన రైతులను అకాల వర్షం కాటేసింది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల పలు మార్కెట్ యార్డలో ఎండబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

Advertisement

ఇంకో వారం అయితే ధాన్యాన్ని మార్కెట్ నుంచి గోడౌన్ లకు తరలించేవారు. ఇంకా కొన్ని రోజులు ధాన్యం ఎండాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ లలో ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవడంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement