WhatsApp
Advertisement

Om Shanti Shanti Shanti : ఈ రీమేక్.. ఒరిజినల్ లా అలరిస్తుందా?

టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాల్లో “ఓం శాంతి శాంతి శాంతి” (Om Shanti Shanti Shanti) ఒకటి. తరుణ్ భాస్కర్ (Tarun Bhasker), ఇషా రెబ్బ (Eesha Rebba) జంటగా నటించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ తో పెంచేయగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ కావడంతో సినిమాపై బుకింగ్స్ కూడా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ బుకింగ్స్ గాని, సోషల్ మీడియాలో రెస్పాన్స్ గాని అనుకున్న విధంగా రావట్లేదన్నది నిజం. ఎందుకంటే ఈ సినిమా ఒక మలయాళ హిట్ సినిమాకి రీమేక్.

మలయాళంలో బసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ నటించిన “జయ జయ జయహే” (Jaya Jaya Jayahe) సినిమాకి రీమేక్ గా “ఓం శాంతి శాంతి శాంతి” తెరకెక్కించారు. సాజివ్ (Saajiv) డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ఓటిటి లో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో తెలుగు డబ్బింగ్ ఉన్నా కూడా తెలుగులో మళ్ళీ రీమేక్ చేయడంతో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి చాలా మంది ఆడియన్స్ లో కనిపించడం లేదు.

Advertisement

ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఒరిజినల్ వెర్షన్ కి చాలా చేంజెస్ ఉండాలి. అక్కడ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ఈ రీమేక్ లో ఉండాల, ప్లస్ సినిమా క్లైమాక్స్ చాలా వరకు చేంజ్ చేసి గుడ్ ఎండింగ్ ఇవ్వాలి. మరి సినిమాలో ఏమేం ఛేంజెస్ చేసారో సినిమా చూస్తే గాని తెలీదు. ఇక తరుణ్ భాస్కర్ కి, అలాగే ఈషా రెబ్బకి మంచి సక్సెస్ ఇపుడు చాలా అవసరం. మరి ఓం శాంతి శాంతి శాంతి వాళ్లకి ఎంత వరకు శాంతినిస్తుందో చూడాలి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement