Advertisement

NTRNeel : సాలిడ్ మాస్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు… బాక్స్ ఆఫీస్ పై స్ట్రాంగ్ “సీల్” పడేలా ఉంది…

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ (JR NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీపై ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదలై దాదాపు రెండేళ్లయినా ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకూ రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా మేకర్స్ పై గుర్రుగా ఉన్నారు. దానికి తోడు లాస్ట్ మూవీ వార్ 2 డిజాస్టర్ తో ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక వీటన్నిటికీ తెర దించుతూ మేకర్స్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుండి కాసేపటి కిందే సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ విడుదల చేయగా, దీంతో పాటు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అలాగే టైటిల్ గురించి కూడా అనౌన్స్ చేసారు.

Advertisement

అలాగే దీనితో పాటు సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ గురించి కూడా అనౌన్స్ చేసారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా మే 20న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందే పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ రిలీజ్ తర్వాత నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement