మన పత్రిక, వెబ్డెస్క్: 2026 నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జనవరి 1 నుంచి సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపించే పలు కీలక నిబంధనలు (New Rules) అమల్లోకి రానున్నాయి. ఆర్థిక లావాదేవీల నుంచి సోషల్ మీడియా వరకు పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ వివరాలు మీకోసం..
ముఖ్యమైన మార్పులు ఇవే:
Advertisement
- క్రెడిట్ స్కోర్ అప్డేట్: ఇప్పటివరకు 15 రోజులకోసారి అప్డేట్ అవుతున్న క్రెడిట్ స్కోర్ (Credit Score), ఇకపై ప్రతి వారం (7 రోజులకు ఒకసారి) అప్డేట్ కానుంది. దీనివల్ల రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం అవుతుంది.
- యూపీఐ & పాన్-ఆధార్: యూపీఐ (UPI), డిజిటల్ చెల్లింపుల నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు పొందాలంటే పాన్-ఆధార్ లింకింగ్ (PAN-Aadhaar Link) తప్పనిసరి. లేదంటే సేవలకు అంతరాయం కలగవచ్చు.
- సోషల్ మీడియాకు సిమ్ బైండింగ్: ఫేక్ అకౌంట్ల బెడద తగ్గించడానికి టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి యాప్స్ వాడాలంటే ‘సిమ్ బైండింగ్’ (SIM Binding) తప్పనిసరి కానుంది. వెరిఫికేషన్ పూర్తయితేనే యాప్ పనిచేస్తుంది.
- ఉద్యోగులకు గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం (8th Pay Commission) అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే జనవరి నుంచి డీఏ (DA) పెంపు కూడా ఉండొచ్చని అంచనా.
- డెలివరీ వాహనాలపై ఆంక్షలు: కాలుష్య నియంత్రణలో భాగంగా ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాల ద్వారా డెలివరీలపై నిషేధం లేదా ఆంక్షలు విధించే ప్రతిపాదనలు ఉన్నాయి.
ఇవే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఈ మార్పులను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
