Advertisement
ncr states urge supreme court to lift ban on crackers

Fire Crackers : బాణసంచా బ్యాన్ చేసిన సుప్రీం.. పిల్లలను పండుగ చేసుకోనివ్వరా?

Fire Crackers : ఎన్‌సీఆర్ ఢిల్లీ రీజియన్ లో కాలుష్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్‌సీఆర్ రీజియన్ లో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా దీపావళి సమయంలో పేల్చే టపాసుల వల్ల వాయు కాలుష్యం తీవ్రత ఇంకా పెరుగుతుంది. అందుకే ఎన్‌సీఆర్ పరిధిలో ఈ దివాళికి ఫైర్ క్రాకర్స్ పేల్చుకుండా సుప్రీం కోర్టు బ్యాన్ విధించింది. బాణసంచా విక్రయాలను కూడా నిషేధించింది. గత ఏప్రిల్ లో 3నే తీర్పును వెలువరించింది.

Advertisement

కానీ, సుప్రీం తీర్పుపై ఎన్‌సీఆర్ రీజియన్ పరిధిలోని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి పండుగ అంటేనే పిల్లలకు ఇష్టం అని, పిల్లలు బాణసంచా ఎప్పుడు కాల్చాలా అని ఎదురు చూస్తుంటారని, అలాంటి పండుగ రోజుల క్రాకర్స్ కాల్చకుండా బ్యాన్ విధించడంతో పండుగ జరుపుకోకుండా అడ్డుకోవడమే అవుతుందని ఆయా రాష్ట్రాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

Advertisement

కనీసం పర్యావరణహితమైన బాణసంచాను కాల్చుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలన్ని సుప్రీంను కోరాయి. దీపావళి రోజున కేవలం రాత్రి 8 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే రెండు గంటల పాటు పర్యావరణహితమైన బాణసంచా పేల్చేందుకు అనుమతివ్వాలని ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు కోరాయి. దీనిపై సుప్రీం కోర్టు కూడా విచారణ చేపట్టింది. ఎన్సీఆర్ రాష్ట్రాల తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. దీనిపై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement