Jubilee Hills By-Election : తెలంగాణ మరోసారి ఎన్నికలకు సిద్ధమౌతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉండటంతో అక్కడ ఉపఎన్నికకు అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు నిలుచుంటారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నిలబడే చాన్స్ ఉన్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
కాకపోతే అధికారికంగా నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం అయితే ప్రకటించలేదు. మరోవైపు నవీన్ యాదవ్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదైంది. అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన మీటింగ్ లో సీఎం రేవంత్.. నవీన్ యాదవ్ పేరునే ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అభ్యర్థి రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొంతు రామ్మోహన్, తాను పోటీ చేయడం లేదని కూడా ప్రకటించడంతో టికెట్ నవీన్ యాదవ్ కే కన్ఫమ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరణించడంతో ఆ స్థానంలో ఉపఎన్నికల జరుగుతోంది. నవంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో ప్రజలకు నిరూపించాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

