Advertisement

మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతా: మంత్రి నారా లోకేశ్

మన పత్రిక, మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజలు అందించిన భారీ మెజారిటీ తన బాధ్యతను మరింత పెంచిందని, దానివల్లే అభివృద్ధి పనులు వేగవంతం చేశానని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పేదలకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి చేపట్టారు.

రూ.1800 కోట్లతో అభివృద్ధి పనులు

నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.1800 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ అభివృద్ధి పనులను కేంద్ర నిధులతో పాటు ఎంపీ పెమ్మసాని సహకారంతో పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు.

Advertisement
Advertisement