Advertisement

కుప్పంలో క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

మన పత్రిక, కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన రెండో రోజు కూడా కొనసాగింది. పర్యటనలో భాగంగా ఆమె క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను, దానితో పాటు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, కుప్పం ప్రాంతానికి 30 పరిశ్రమలను తీసుకువచ్చి వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అలాగే, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ అంశంపై వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement