Advertisement

హీరోయిన్ కాయాదు రాకపోవడంపై నాని క్లారిటీ

మన పత్రిక: నటుడు నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ది పారడైజ్’ చిత్ర బృందం ప్రస్తుతం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న కాయాదు లోహర్ ఇటీవల జరుగుతున్న ప్రచార వేడుకల్లో కనిపించకపోవడంపై అభిమానుల్లో చర్చ నడిచింది. చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై నాని స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.

చిత్ర బృందానికి, కాయాదు లోహర్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని నాని తెలిపారు. ఆమె ప్రస్తుతం దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఒక చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారని వెల్లడించారు. ఆ సినిమా చిత్రీకరణ వల్లనే చెన్నై ప్రెస్ మీట్‌కు రావడానికి మారి సెల్వరాజ్ అనుమతించలేదని నాని సరదాగా పేర్కొన్నారు.

Advertisement

శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 21న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement