Advertisement

Bigg boss 9 : మాధురి తర్వాత ఎక్కువ నెగిటివిటి తనకే?

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల సెలక్షన్ ఈ సీజన్లో వరెస్ట్ అనేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి మెజారిటీ వాళ్ళకి బయట వేరే విధంగా పేరుంది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక కూడా ఫస్ట్ డే నుండే అదే విధంగా కంటెస్టెంట్స్ తో ప్రవర్తిస్తున్నారు.

ముఖ్యంగా దివ్వెల మాధురి అందరు కంటెస్టెంట్స్ తో కూడా కాస్త కోపంగా ఉంటున్నారు. చిన్న చిన్న తప్పులకి కూడా గొడవపడుతూ నెగిటివిటిని మూటగట్టుకుంటున్నారు. అయితే ఈమె తర్వాత ఆయేషా కూడా కంటెస్టెంట్లతో సరదాగా ఉంటూనే, ఏదైనా గొడవ వస్తే గోరు పెద్దది చేసుకుంటుంది. కానీ వీళ్ళ కంటే తానే డేంజర్ అని పికిల్స్ పాప రమ్య మోక్ష(Ramya moksha) నిరూపించుకుంటుంది.

Advertisement

హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక రమ్య మోక్ష తాను డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కంటెస్టెంట్ల క్యారెక్టర్లను కూడా డిసైడ్ చేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన శనివారం ప్రోమోలో అది చూపించగా, కొందరిపై మంచిగా ఉంటూనే, బ్యాక్ నుండి గుచ్చినట్టు వేరే కంటెస్టెంట్ల మైండ్ లో ఫిక్స్ చేస్తుందని, ఇది మానుకోవాలని నాగార్జున రమ్యను హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మాధురి తర్వాత ఎక్కువ నెగిటివిటిని రమ్య సొంతం చేసుకుంది. మరి నెక్స్ట్ వీక్ అయినా మారుతుందా లేదా అన్నది చూడాలి.

Advertisement