బిగ్ బాస్ సీజన్ 9 లో ఆరో వారం లో కెప్టెన్సీ టాస్క్ జరగగా ఈ టాస్క్ లో సుమన్ శెట్టి, గౌరవ్ గుప్త గెలిచి ఇద్దరూ కెప్టెన్లు అయ్యారన్న విషయం తెలిసిందే. ఇక శనివారం రానే వచ్చేసింది. సో ఈ వారం కంటెస్టెంట్లు చేసిన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేయడానికి నాగ్ (Nagarjuna) వచ్చేసాడు. ఈ సారి అందరికి గట్టిగా కౌంటర్లు వేసాడని తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో తెలుస్తూనే ఉంది.
వైల్డ్ కార్డు కంటెస్టెంట్లలో నిఖిల్, గౌరవ్ మినహా అందరికి గట్టి కౌంటర్ ఇచ్చాడు నాగార్జున. బిగ్ బాస్ లో వాళ్ళు ఎంట్రీ ఇచ్చింది ఎందుకు? చేస్తుంది ఏమిటి అని వాళ్ళు చేసిన తప్పుల్ని చెప్తూ కడిగిపడేసాడు. అలాగే రాము, దివ్య, భరణి, రీతూ, పవన్ లను కూడా వాళ్ళ ఆటల గురించి హెచ్చరిస్తూ అలర్ట్ చేశారు.
అయితే రానున్న ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా ఉన్న కొందరి నుండి వాళ్ళకిచ్చిన పవర్స్ ని కొన్ని తీసుకోనున్నాడని సమాచారం. అయితే అవి ఏవి అన్నది ఎపిసోడ్ లో చూసి తీరాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
