Advertisement

నాగార్జున 100వ చిత్రానికి ‘కింగ్ 100’ టైటిల్ ఖరారు

మన పత్రిక: అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత కీలకమైన 100వ చిత్రానికి సిద్ధమయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారికంగా మొదటి గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో నాగార్జున నయా లుక్‌తో కనిపించారు.

ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. సమాజంలో ఒక వ్యక్తికి దక్కే గౌరవాన్ని డబ్బే నిర్ణయిస్తుందని నమ్మే ఒక వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. సంపద, విజయం సాధించాలనే లక్ష్యంతో పాటు సమాజంలో తన గుర్తింపును, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే కథానాయకుడి పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. తండ్రీకూతుళ్ల భావోద్వేగాల నేపథ్యంతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Advertisement

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, సుష్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

Advertisement