మన పత్రిక, వెబ్‌డెస్క్
చైనాలో జరిగిన SCO శిఖరాగ్ర ( sco summit ) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఫొటోలు షేర్ చేశారు. ఆయనతో హత్తుకుని, నవ్వుతూ సంభాషించిన సన్నివేశాలు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. ఇది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో కూడా మోదీ సంభాషించారు. ప్రాంతీయ సహకారం, భద్రతా సవాళ్లు, ఆర్థిక భాగస్వామ్యాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. SCO సదస్సులో భారత్, రష్యా, చైనా సహా పలు సభ్య దేశాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం సామూహిక ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. మోదీ పుతిన్‌ల సమావేశం అంతర్జాతీయ స్థాయిలో దృష్టి ఆకర్షించింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని సంకేతాలిచ్చింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
