మన పత్రిక: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తమిళ చిత్రం మోద రాత్రి డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి.
రాజా కరుప్పసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా చిత్రంలో రిషికాంత్, అనిష్మ అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో మిస్టరీ అంశాలు కూడా ఉన్నాయి. భగవతి పెరుమాళ్, ఎ. వెంకటేష్, చేతన్, అబ్దుల్ లీ, షెల్లీ కిషోర్, సంగీత బాబాలన్, భానుప్రియ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. దర్శకుడిగా రాజా కరుప్పసామికి ఇది తొలి చిత్రం. ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఓటీటీలోకి రావడం ద్వారా మరిన్ని భాషల ప్రేక్షకులకు చేరువ కానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
