మన పత్రిక, కాలిఫోర్నియా: సోషల్ మీడియా దిగ్గజం Metaలో చేపట్టిన లేఆఫ్స్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. తమను అన్యాయంగా తొలగించారంటూ 26 మంది మాజీ ఉద్యోగులు ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంస్థ తన లేఆఫ్స్ నిర్ణయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించి, వికలాంగులతో పాటు మెడికల్ లీవ్‌లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు.
ఏఐ పాత్రపై ఆరోపణలు ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి మెటామేట్ అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్, సెకండ్ బ్రెయిన్ వంటి వ్యవస్థలను ఉపయోగించినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. కీబోర్డ్ స్ట్రోక్స్, బ్రౌజర్ హిస్టరీ, ఈమెయిల్స్ ఆధారంగా సేకరించిన ప్రొడక్టివిటీ స్కోర్‌తో తమ పనితీరును తక్కువగా అంచనా వేశారని వారు వాదిస్తున్నారు. కాలిఫోర్నియా, న్యూయార్క్ చట్టాల ప్రకారం ఏఐ వ్యవస్థల్లోని లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా లేఆఫ్స్ ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను Meta ప్రతినిధులు తోసిపుచ్చారు. మానవ వనరుల నిర్వహణ నిర్ణయాల్లో ఏఐ పాత్ర లేదని, యాజమాన్యమే స్వయంగా నిర్ణయాలు తీసుకుందని వారు స్పష్టం చేశారు. కంపెనీ తన ఆర్గనైజేషనల్ ప్రాధాన్యతల్లో భాగంగా దాదాపు 10 శాతం మందిని, అంటే 8,000 మందిని తొలగించింది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్ లామినే యామల్ ప్రేమకథ: ప్రియురాలికి బెంజ్ కారు గిఫ్ట్
- దుబాయ్‌లో ఘనంగా జరిగిన ఈటీసీఏ బోనాల జాతర
- సెన్సార్ పూర్తి చేసుకున్న కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ
- లార్డ్స్ మైదానంలో గౌతమ్ గంభీర్‌ను పట్టించుకోని రోహిత్ శర్మ
- తమ్మినేని సీతారాంపై భూకబ్జా కేసు: నకిలీ డెత్ సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్
