Advertisement

భారత్‌లో కొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్ కార్ విడుదల

మన పత్రిక, హైదరాబాద్: భారత్‌లో Mercedes AMG E 53 Hybrid 4MATIC+ మోడల్‌ను మెర్సిడెస్ బెంచ్ ఇండియా అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త పెర్ఫార్మెన్స్ ఎడిషన్ ధరను రూ. 1.45 కోట్లుగా, రేసింగ్ ఎడిషన్ ధరను రూ. 1.48 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కారు కోసం డీలర్ నెట్‌వర్క్ అంతటా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, డెలివరీలు కూడా వెంటనే మొదలవుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మనదేశంలో మూడు దశాబ్దాలకు పైగా విక్రయమవుతున్న ఈ సిరీస్‌లో ఇది మొదటి ఎలక్ట్రిఫైడ్ ఏఎమ్‌జీ ఈ-క్లాస్ మోడల్ కావడం గమనార్హం.

ఈ కారులో 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్-లైన్ సిక్స్ ఇంజిన్‌తో పాటు 120kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 9-స్పీడ్ ఏఎమ్‌జీ స్పీడ్‌షిఫ్ట్ టీసీటీ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ మరియు మోటార్ కలిసి మొత్తం 585hp శక్తిని, 750Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. రేస్ స్టార్ట్ ఆప్షన్ ఉపయోగిస్తే 612hp వరకు శక్తి లభిస్తుంది. ఈ కారు గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.8 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు కాగా, ఐచ్ఛిక ఏఎమ్‌జీ డ్రైవర్స్ ప్యాకేజీతో 280 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చు.

Advertisement

ఈ మోడల్‌లో 28.6kWh బ్యాటరీని బూట్ ఫ్లోర్ కింద ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వెసులుబాటును ఇస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌పై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీనికి 11kW ఏసీ ఛార్జర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. డిజైన్ పరంగా ఇల్యూమినేటెడ్ ఏఎమ్‌జీ గ్రిల్, రెండు వైపులా వెడల్పుగా ఉండే ఫెండర్లు, 20-ఇంచ్ మ్యాట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. కారు లోపల ఏఎమ్‌జీ స్పోర్ట్స్ సీట్లు, డోల్బీ ఆట్మోస్ సపోర్ట్‌తో కూడిన 17-స్పీకర్ల బర్మెస్టర్ 4D సౌండ్ సిస్టమ్ కలవు.

Advertisement