టాలీవుడ్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి (Anil Raavipudi) ప్రత్యేక స్థానముంది. ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఇతడు, ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండగా, కామెడీ కి కేరాఫ్ అయ్యాడు. అయితే అనిల్ రావిపూడి సినిమాలన్నీ రొటీన్ గా ఉంటాయన్న విమర్శలున్నా, అప్పటికప్పుడు పండక్కి నవ్వుకునే సినిమాలివ్వడం లో ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకి ఎంత నెగిటివిటి ఉన్నా, సినిమా రిలీజ్ టైం వచ్చే సరికి హైప్ ఎలాగైనా తెప్పిస్తాడు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో చేస్తున్న “మన శంకర వర ప్రసాద్” (Mana Shankara Varaprasad) పై కూడా రిలీజ్ ముందు నుండే ట్రోలింగ్ నడుస్తుండగా, తాజాగా “మీసాల పిల్ల” అంటూ అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాల్ని తారుమారు చేసేసాడు. రెండు రోజుల కింద రిలీజ్ అయిన ఈ పాటని కొంత ట్రోల్ చేసినా, మెల్లిగా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం మీసాల పిల్ల సాంగ్ ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందంటే అర్ధం చేస్తుకోవచ్చు ఈ పాటకి ఎంత కనెక్ట్ అవుతున్నారో.
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం లో “గోదారి గట్టు మీద” సాంగ్ ఎంత ఫేమస్ అయిందో, ఈ “మీసాల పిల్ల” సాంగ్ కూడా పాపులర్ అవుతుందనేది ట్రేడ్ పండితుల మాట. ఇక నెగిటివిటీతో సంబంధం లేకుండా ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయగా 300k లైక్స్ తో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
