Meesala Pilla Song : ఏ మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల.. పొద్దున లేచిన దగ్గర్నుంచి డెయిలీ యుద్దాలా? మొగుడు పెళ్లాలు అంటేనే కంట్రీ గొడవలా? అట్టా కన్నెర్ర జేయాలా? కారాలే నూరాలా? ఇట్లా దుమ్మెత్తి పోయాలా? దూరాలే పెంచేలా? కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా? అంటూ బాస్ బతిమిలాడితే ఎలా ఉంటుంది చెప్పండి.
ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా తగ్గలేదు. యువకుడిలా తయారై మీసాల పిల్ల అంటూ నయనతారను ఆటపట్టిస్తూ చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. చిరు వింటేజ్ లుక్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మన శంకర వరప్రసాద్ గారు అంటూ ఈ సంక్రాంతికి బాస్ బాక్సాఫీసును గడగడలాడించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరీలియో మ్యూజిక్ డైరెక్టర్.
ఇటీవలే దసరా సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

