టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో “మంచు మనోజ్” (Manchu Manoj) ఒకరు. ఇండస్ట్రీలో మంచు ముత్యంగా పేరున్న మనోజ్ కెరీర్ బిగినింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ లో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న మనోజ్, రీసెంట్ గా మిరాయ్ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఓ ప్రయోగాత్మక సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా పీరియాడికల్ నేపథ్యంలో మనోజ్ ఓ సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి “డేవిడ్ రెడ్డి” (David Reddy) అనే టైటిల్ ఫిక్స్ చేయగా తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. హనుమరెడ్డి యక్కంటి (HanumaReddy Yakkanti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ బైక్ పై బ్రూటల్ గా రైడ్ చేస్తూ కనిపిస్తున్నాడు. పోస్టర్ మొత్తం నల్లగా ఉండి ఆకట్టుకుంటుంది. ఇక ట్విట్టర్ లో ఈ ఫస్ట్ లుక్ ను పంచుకున్న మనోజ్.. “నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్ర”.. ఎంతో క్రూరమైన, క్షమాగుణం లేనిది” అంటూ క్యాప్షన్ పెట్టి ఆడియన్స్ తో తన ఒపీనియన్ పంచుకున్నాడు.
ఇక “డేవిడ్ రెడ్డి” మూవీ స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథగా, బ్రిటిష్ వారిపై పోరాడిన “డేవిడ్ రెడ్డి” అనే యువకుడి కథగా రానున్నట్లు సమాచారం. దీని కోసం మేకర్స్ “వార్ డాగ్” (War Dog) అనే బైక్ ను కూడా స్పెషల్ గా డిజైన్ చేయగా, దాని బరువు దాదాపు 700 కేజీలని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ ప్రిన్స్ మూవీ ఫేమ్ “మరియా” (Maria) నటించనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు మిరాయ్ తో అదిరిపోయేలా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన మంచు మనోజ్, ఈసారి డేవిడ్ రెడ్డిగా అంతకు మించిన కిక్కివ్వనున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
