మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana shankara vara prasad garu) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 12న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో భారీ ఓపెనింగ్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ వసూళ్ళని సాధించింది. ఏకంగా 300 కోట్లకి పైగా కొల్లగొట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి అదిరిపోయే స్టడీ కలెక్షన్లు రాబడుతూ మరింత ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం ని బ్రేక్ చేసి రీజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “మన శంకర వర ప్రసాద్ గారు ఇప్పుడు ఫ్యాన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేయడానికి తొందర్లోనే ఓటిటి లోకి వచ్చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఇప్పుడు అఫిషియల్ గా ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 (ZEE5) “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్ర డిజిటల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే విశేషమేమిటంటే ఈ సినిమా ఓటిటిలో ఏకంగా తెలుగుతో పాటు (హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ) భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
ఇక సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాలకే, అంటే ఇంత తక్కువ సమయానికే ఓటిటి లో ఏకంగా ఇన్ని భాషల్లో స్ట్రీమింగ్ కావడం అరుదైన విషయమని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నయనతార (Nayanatara) హీరోయిన్ గా నటించగా, విక్టరీ వెంకటేష్ (Venkatesh) స్పెషల్ గెస్ట్ రోల్ లో నటించడం విశేషం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత ఈ సినిమా నిర్మించారు. మరి ఓటిటి లో “మన శంకర వర ప్రసాద్ గారు” ఫ్యామిలీస్ కి ఎంత చేరువ అవుతారో చూడాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
