టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో ఓ రెండు సినిమాలు మినహా మిగతా సినిమాలు ఆడియన్స్ ని మెప్పించగా, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” అభిమానులతో పాటు సాధారణ ఫ్యామిలి ప్రేక్షకుల్ని థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. చిరు కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి ఎంటెర్టైనెంట్ దర్శకత్వ ప్రతిభకు తోడు, వెంకటేష్ స్పెషల్ క్యామియో కూడా తోడవడంతో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది ఈ సినిమా.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా తొలివారం 233 కోట్ల కి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇప్పటికే 250 కోట్ల మార్క్ క్రాస్ చేసిన మన శంకర వర ప్రసాద్ అతి త్వరలోనే ట్రిపుల్ సెంచరీని అందుకుని రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా మారడానికి దూసుకువస్తుంది. ప్రస్తుతం రీజనల్ ఇండస్ట్రీ హిట్ మూవీగా ఉన్న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా 280 కోట్లకి పైగా వసూలు చేయగా, చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు త్వరలోనే బ్రేక్ చేసేందుకు వచ్చేస్తున్నాడు అని చెప్పాలి.
ఇదిలా ఉండగా, ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన నవీన్ పోలిశెట్టి “అనగనగ ఒకరాజు” మంచి టాక్ తో వంద కోట్ల వసూళ్లను అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచి లాంగ్ రన్ లో దూసుకుపోతున్నాడు. అలాగే శర్వానంద్ “నారి నారి నడుమ మురారి” కూడా సక్సెస్ తో చిరు సినిమాలకు పోటీ ఇస్తున్నారు. ఇక మన శంకర వర ప్రసాద్” ఇప్పటికే బయ్యర్లకు 30 కోట్లకి పైగా లాభాలు తీసుకురాగా, భారీ లాభాలు తెచ్చిపెట్టే దిశగా సినిమా దూసుకెళ్తుందని చెప్పాలి.
