Chevella Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? ఎందుకు దానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అంటూ స్పష్టం చేశారు. రెగ్యులర్ గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే ఇది. రోడ్డు బాగాలేక జరిగింది కాదు.. గత ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగలేదా? రోడ్డు బాగున్న హైవేల మీద యాక్సిడెంట్స్ జరగడం లేదా అని మల్లు రవి ప్రశ్నించారు.
చేవెళ్ల యాక్సిడెంట్ లో 21 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి వేగంతో వచ్చిన టిప్పర్ లారీ చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తుక్కుతుక్కు అయింది. ఈ ప్రమాదంలో అటు ఆర్టీసీ బస్సు, ఇటు లారీకి చెందిన ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. అలాగే, తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు ఒక పాప, తల్లి కూడా చనిపోయారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

