మన పత్రిక, వెబ్‌డెస్క్: కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మహీంద్రా నుంచి మోస్ట్ అవైటెడ్ ఎస్యూవీ ‘ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ’ (XUV 7XO 2026) రేపు (జనవరి 5న) భారత మార్కెట్లోకి విడుదల కానుంది. పాపులర్ ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా వస్తున్న ఈ కారులో విప్లవాత్మక మార్పులు ఉండనున్నాయి. ఇప్పటికే రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
XUV 7XO హైలైట్స్ ఇవే:
- ఎక్స్టీరియర్: ఇది సరికొత్త ‘రెడ్’ కలర్ వేరియంట్లో రానుంది. ముందు వైపు కొత్త గ్రిల్, స్లీక్ ఎల్ఈడీ లైట్లు, అగ్రెసివ్ బంపర్, 18-ఇంచ్ అలాయ్ వీల్స్‌తో చాలా బోల్డ్‌గా కనిపిస్తుంది.
- ట్రిపుల్ స్క్రీన్ సెటప్: ఇంటీరియర్‌లో ప్రధాన ఆకర్షణ మూడు స్క్రీన్లు. ఒకటి ఇన్ఫోటైన్మెంట్, రెండు డ్రైవర్ డిస్ప్లే, మూడు కంట్రోల్స్ కోసం ఉంటాయి. క్యాబిన్ వైట్ థీమ్‌తో ప్రీమియం లుక్‌ని ఇస్తుంది.
- అదిరిపోయే ఫీచర్లు: 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 16-స్పీకర్ల హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, వెనుక సీట్లకు కూడా వె వెంటిలేషన్, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం విశేషం.
- సేఫ్టీ: ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 540-డిగ్రీ కెమెరా, ADAS లెవల్-2 (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్) వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.
Xuv 7xo price – ధర (అంచనా) : ఈ ఎస్యూవీ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 15 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
