Advertisement

సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సుమంత్ మహేంద్రగిరి వారాహి

సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఆ సమయంలో ఇతర పెద్ద చిత్రాలు ఏవీ లేకపోవడంతో, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి అవకాశం లభించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో వారాహి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఈ సినిమా కోసం మరిన్ని వినూత్న ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Advertisement
Advertisement