Advertisement

స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాల వెనుక లోకేష్ హస్తం: మార్గాని భరత్

అమరావతి: స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులే అంగీకరించారని, దీనిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందంటే అవకతవకలు జరిగినట్లు స్పష్టమైపోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ అక్రమాల వెనుక మంత్రి నారా లోకేష్‌ హస్తం ఉందని ఆరోపించారు. విజిలెన్స్‌ కాకుండా ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని, ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి లోకేష్‌ పచ్చి అబద్ధాలతో అసెంబ్లీని సైతం అవమానపరిచారని మండిపడ్డారు. జూడో అసోసియేషన్ ఛైర్మన్ లోకేష్‌ తోడల్లుడేనని, ఆ అసోసియేషన్ నుంచే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సవాల్ చేసే స్థాయి లోకేష్‌కు లేదని, దమ్ముంటే తనతో చర్చకు రావాలని.. డేట్‌, టైం లోకేషే ప్రకటించాలని మార్గాని భరత్ సవాల్ విసిరారు.

Advertisement
Advertisement