Advertisement

కర్నూలులో ఘోర ప్రమాదం: వాహనం ఢీకొని ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ మృతి

మన పత్రిక, కర్నూలు: నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి మృతి చెందారు. నిత్యం వ్యాయామం కోసం వెళ్లే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వరప్రసాద్ రెడ్డి జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తుండగా, వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఆయన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆయన ఫ్లైఓవర్ పై నుంచి కింద రోడ్డుపై పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement