Konda Surekha : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసిన అంశం అంటే మంత్రి కొండా సురేఖ విషయమే. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ నేతలతో మంత్రి కొండా సురేఖకు పొసగడం లేదు. సొంత పార్టీతోనే గొడవలు జరుగుతుండటం ఒక వైపు అయితే. మరోవైపు మంత్రి ఓఎస్డీ అయిన సుమంత్ డబ్బుల కోసం డెక్కన్ సిమెంట్స్ కంపెనీ అధికారులను గన్ తో బెదిరించారనే ఆరోపణలు రావడంతో రాత్రి కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో పోలీసులు వెళ్లారు.
ఆ సమయంలో కొండా సురేఖ కూతురు సుష్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమంత్ ను ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఆ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములపై సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డికి గన్ మెన్లు ఎందుకు? వాళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారు? టెండర్ల పేరుతో, సెటిల్మెంట్ పేర్లతో ప్రభుత్వంలో ఉన్న వాళ్లే దోపిడి చేస్తున్నారు అన్నట్టుగా పోలీసులు, మీడియా ముందు సుష్మిత బయటపెట్టడంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారో?
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

