Komatreddy : ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు.. అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల నరదిష్టి వల్లనే కోనసీమ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించారు. ఆయన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోము. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైనా ఆడుతాయి. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం.. అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
